Site icon NTV Telugu

Naveen Polishetty: ‘సార్’ గొంతు పెట్టి నిన్ను మోసం చేశారు బ్రో…

Naveen Polishetty

Naveen Polishetty

యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్న ఈ మూవీని మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ చిత్రాల్లో పాటలు పాడుకుంటున్నారనీ తనూ పాడుకుంటానని చెబుతూ.. అటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ల వద్ద ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు, సరే అని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ నవీన్ పోలిశెట్టికి మైక్ ఇచ్చాడు. తీరా అతన పాడుతుంటే ప్యాన్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్‌ వాయిస్ వినిపిస్తోంది.

Read Also: Ram Charan: పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఊహించని కాంబినేషన్ సెట్…

మరి ఇదెలా సాధ్యం అంటే.. సింపుల్.. ఈ మూవీ కోసం నిజంగానే ధనుష్ పాట పాడాడు. అనౌన్స్‌మెంట్ వీడియోలో, నవీన్ తన దర్శకుడిని మరియు నిర్మాతను తాను పాట పాడతాను అని ఒప్పించే ప్రయత్నం చూశాం కానీ వారు అతని తమాషా ప్రయత్నాలను తిరస్కరించారు. ఈ పాటకోసం ధనుష్‌ను తీసుకువచ్చారు.”హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. మే 31న ధనుష్‌ పాడుతున్న లిరికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అదిరిపోతుంది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కామెడీ టైమింగ్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో మొత్తం ఉంది, చూసి ఎంజాయ్ చేసేయండి.

 

Exit mobile version