Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు .. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు అందరు విన్నర్ గా ఎవరు నిలుస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా అందరి చూపు పల్లవి ప్రశాంత్ మీదనే ఉంది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. తనదైన ఆటతో ఇన్ని వారాలు టాప్ లో నిలుస్తూ రావడం అంటే మాములు విషయం కాదు. ఇక గతవారం ఎవిక్షన్ పాస్ కోసం యావర్ ఎంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే. అయితే .. ఎక్కువ ఫౌల్స్ చేయడంతో యావర్.. తనంతట తానే ఆ పాస్ ను బిగ్ బాస్ కు వెనక్కి ఇచ్చేసాడు. ఇక ఈ వారం ఎవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ .. కంటెస్టెంట్స్ కు చివరి అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగానే హౌస్ మేట్స్ అందరికీ ఒక గేమ్ పెట్టగా.. అందులో పల్లవి ప్రశాంత్ గెలిచి ఎవిక్షన్ పాస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒక సాధారణ రైతు బిడ్డ ఎవిక్షన్ పాస్ గెలుచుకోవడం చూసి మిగతావారు కుళ్ళుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.
ఇక ఎవిక్షన్ పాస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోవడానికి కానీ, తమకు సన్నిహితులు అయిన వారికోసమైన వాడాలి. ఇక ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంత్.. ఈ ఎవిక్షన్ పాస్ ను ఎవరికి వాడతాడా ..? అని అందరు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో ప్రశాంత్ తో పాటు రతిక, యావర్ కూడా ఉన్నారు. ఒకవేళ.. నాగార్జున ఆ ఇద్దరిలో ఎవరిని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి ఎవిక్షన్ పాస్ వాడతావు అని అడిగితే.. ప్రశాంత్.. రతిక పేరు చెప్తాడా.. ? లేదా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి రైతు బిడ్డ.. ఆమెకోసం ఎవిక్షన్ పాస్ ను వాడతాడా.. ? లేదా.. ? చూడాలి.