NTV Telugu Site icon

Pallavi Prashanth: ఇదెక్కడి దరిద్రంరా అయ్యా.. ప్రశాంత్ రతికాను అక్క అంటుండు ఏంది?

Pallavi Prashanth Call Rathika Rose As Sister

Pallavi Prashanth Call Rathika Rose As Sister

Pallavi Prashanth Calls Rathika Rose as Sister in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ నుంచి ఎన్నెన్నో ఆణిముత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌస్‌లో విహరించి కక్కుర్తి పనులు చేసిన పల్లవి ప్రశాంత్, రతికలు ఇప్పుడు అనూహ్యంగా అక్కా తమ్ముళ్లు అయిపోయారు. రతిక మంచంపై కూర్చుని ఉంటే మన పులిహోర బిడ్డ సారీ రైతుబిడ్డనని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ వెళ్లి ఆమె కాళ్ల దగ్గర కూర్చుని.. రెండు చేతులు జోడించి దండం పెట్టి అక్కా.. రతిక అక్కా’ అని మాట్లాడడం చిరాకు తెప్పిస్తోంది. ‘‘నన్ను క్షమించావో, లేదో, చెప్పు అక్కా.. ఇప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ ఎట్టా ఉంటాడో నువ్వే చూస్తావ్ అక్కా ఇప్పటి వరకూ నేను చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను అక్క మళ్లీ నీ విషయంలో నేను వేలు పెడితే చీపురు పెట్టి కొట్టు అంటూ చెప్పుకొచ్చాడు.

iPhone 15 for free: ఉచితంగా iPhone 15.. నమ్మితే బుక్కవుతారు జాగ్రత్త!

నేనేం వద్దనను, ఇప్పటి నుంచి నన్ను నీ తమ్ముడే అనుకో నేను నిన్ను అక్కా అనే పిలుస్తా, అక్కగానే చూస్తా నన్ను క్షమించు అక్కా’ అని రతిక కాళ్ల దగ్గర కూర్చుని మరీ క్షమాపణ చెప్పాడు పల్లవి ప్రశాంత్. దానికి రతిక కూడా నన్ను ఏమేమీ అన్నావో, ఏమేమి చేశావో ఏమీ మర్చిపోను అన్నీ సరదా కోసమే చేశావా? ఇప్పటి వరకూ మన మధ్య జరిగిన వన్నీ వదిలేసెయ్ అని రతిక చెప్పుకొచ్చింది. దానికి వాటన్నింటికీ క్షమించమని కోరుతున్నాను అక్కా, అని క్షమాపణ చెప్పాడు పల్లవి ప్రశాంత్. చివరికి ‘సరే క్షమించా, పో’ అనేసరికి రతిక కాళ్ల దగ్గర నుంచి లేచి వెళ్లిపోయాడు పల్లవి ప్రశాంత్. నిన్నటి వరకూ రతిక కోసం తపించి పోయిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు రతికని అక్క అనడం మాత్రం పరమ అహస్యంగా అనిపిస్తోంది.