Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faiza Ali: పెళ్లి తర్వాత నటీనటులు తమ కెరీర్లో కొన్ని పరిమితులు పెట్టుకోవడం కొత్త విషయం కాదు. కొందరు రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటే, మరికొందరు పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెబుతారు. అయితే పెళ్లి తర్వాత హీరోతో సన్నిహిత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేనని పాకిస్తానీ నటి ఫైజా అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైజా అలీ 2026లో ఐజాజ్ ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆమె ఫవాద్ ఫరూఖ్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంతో సంతోషంగా ఉన్న ఆమె, తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని పెళ్లి తర్వాత తన నటనా ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రొమాంటిక్ సన్నివేశాల గురించి ప్రశ్నించగా, ఒక దశ తర్వాత అలాంటి పాత్రలు చేయడం తనకు సరైనదిగా అనిపించదని ఫైజా తెలిపారు. తాను పెళ్లి చేసుకున్నానని చెబుతూ, మరో హీరో చేతుల్లో ఊగుతూ ప్రేమ పాటలు పాడటం తన భర్తకు అసౌకర్యంగా ఉంటుందని అన్నారు. అలాగే కెమెరా ముందు మరో నటుడి కళ్లలోకి ప్రేమగా చూస్తూ నటించడం కూడా ఇప్పుడు తనకు మంచిగా అనిపించదని వెల్లడించారు. తన జీవితంలో ఐజాజ్ ఖాన్ లేకపోయి ఉంటే, ఒకవేలా తాను ఇప్పటికీ అవివాహితగా ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమోనని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. కానీ వివాహం తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాను నమ్ముతున్నానని చెప్పారు. ముఖ్యంగా పాకిస్తాన్ కట్టుబాట్లు, అక్కడి సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని నటీనటులు కొన్ని హద్దులు పాటించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
ప్రస్తుతం సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని, ప్రమోషన్లలో కూడా రొమాంటిక్ కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఫైజా అన్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య బోల్డ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని వెల్లడించారు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఫైజా అలీ ప్రస్తుతం టెలివిజన్ హోస్ట్‌గా, గాయనిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అందంతో పాటు, మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందిన ఆమె, మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ‘మెహందీ’ సీరియల్‌తో నటిగా పరిచయం అయ్యారు. అనంతరం నటి, గాయని, సంగీతం వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు.
పెళ్లి తర్వాత నటనలో తనకు తానే కొన్ని పరిమితులు పెట్టుకున్నానని ఫైజా అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో తన అభిప్రాయాన్ని ఆమె నేరుగా చెప్పడంతో పలువురు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం నటనను పర్సనల్ లైఫ్ తో ముడిపెట్టకూడదని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!