NTV Telugu Site icon

Pa. Ranjith: సనాతన ధర్మంపై ఉదయనిధి మాటల్లో తప్పేం లేదు.. పా.రంజిత్ సంచలన ట్వీట్

Pa Ranjith Supports Udayanidhi Stalin Comments

Pa Ranjith Supports Udayanidhi Stalin Comments

Pa. Ranjith Supports Udayanidhi Stalin Statement on Sanathana Dharma: డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో సమానంగా సనాతన ధర్మం కూడా ఒక వ్యాధి లాంటిదని దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు అధికార పార్టీకి చెందిన ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే /మంత్రిగా వ్యవహరిస్తున్న ఉదయనిది స్టాలిన్ హీరోగా కూడా అందరికీ పరిచయమే. ఆయన ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్ చేశారు ఆయన చేసిన కామెంట్ల మీద ఒక్కసారిగా దేశం అంతా భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది సనాతన ధర్మాన్ని నమ్మే వారందరూ ఉదయనిది మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో తమిళంలో సార్పట్టా పరంపర, కాలా, కబాలి లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన పా రంజిత్ మాత్రం ఉదయనిది స్టేట్మెంట్ కి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఉదయనిది ఏదైతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కామెంట్ చేశారు. అది యాంటీ కాస్ట్ మూమెంట్ కి సంబంధించిన కోర్ ప్రిన్సిపల్ అని అనేక దశాబ్దాలుగా ఈ పాయింట్ కోసమే యాంటీ క్యాస్ట్ మూమెంట్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

Anushka: మిస్ శెట్టి ప్రమోషన్స్ లోకి ప్రభాస్ ను లాగిన అనుష్క

కులం, లింగ బేధం వంటి వాటిని అడ్డుగా చూపిస్తూ ఎన్నో దారుణమైన విషయాలను సనాతన ధర్మం పేరుతో జనాల నెత్తిన రుద్దేరని, దారుణమైన విషయాలు చేశారని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్, యాంటీ క్యాస్ట్ రిఫార్మర్లైన జ్యోతి దాస్ పండితార్, తాంతే పెరియార్, మహాత్మా పూలే, సంత్ రవిదాస్ వంటి వారందరూ ఇదే విషయాన్ని యాంటీ క్యాస్ట్ ఐడియాలజీ ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ఉదయనిది చేసిన ప్రకటనను వక్రీకరించి, ఇదేదో ఒక మారణ హోమానికి పిలుపునిచ్చే దారుణమైన వ్యాఖ్యలు అంటూ ప్రచారం చేయడం కలవారి పెడుతోంది. ఆయన మీద ద్వేషం పెరుగుతోంది, ఆయన తల నరికి తెస్తే 10 కోట్లు ఇస్తామని అనడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ,సామాజిక న్యాయం సమానత్వంతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన ఉదయ నిధి స్టాలిన్ మాటలకు నేను మద్దతుగా నిలుస్తున్నాను. మంత్రి ఉదయనిధి స్టాలిన్ కి నా సంఘీభావం అంటూ పా రంజిత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.