NTV Telugu Site icon

Sabari : ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్‌ ‘శబరి’.. ఎక్కడ ఎప్పుడు చూడాలంటే?

Sabari

Sabari

Varalakshmi Sarath Kumar starrer ‘Sabari’ OTT Release: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్టోబర్ 11న సినిమా sunNXT OTTలో 5 భాషల్లో విడుదల కాబోతున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది.

Manchu Vishnu: మంచు విష్ణుకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ తొలగించాలి!

వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. ముఖ్యంగా ఆమె నటన ‘వావ్’ అనేలా ఉంటుంది. ‘శబరి’ చిత్రం 300 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మే 3న విడుదలయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది. అక్టోబర్ 11న అన్ని భాషల్లో sunNXT OTTలో విడుదల చేయబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది” అని చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Show comments