Site icon NTV Telugu

Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!

Maheshorey

Maheshorey

Orey word Trending in Twitter by Mahesh Fans due to Kurchi Madathapetti Promo: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నటిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరు కారం సినిమా నుంచి మాస్‌ సాంగ్‌ గా చెబుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ ప్రోమోను యూనిట్ విడుదల చేసింది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ మొదలవుతున్న ఈ పాట ప్రోమో చూసి మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుర్చీ మడత పెట్టి అనేది ఒక బూతు డైలాగ్, దాన్ని ఒక ముసలి వ్యక్తి ఏదో యూట్యూబ్ ఛానల్ లో చెప్పగా ఫేమస్ అయింది. అలాంటి దాన్ని తీసుకొచ్చి మహేష్ సినిమా సాంగ్ కి మొదటి పదంగా పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

Tollywood: మీ చుట్టూ సోషల్ మీడియా తిరగాలి కానీ.. మీరు తిరిగితే ఎలా?

ఈ క్రమంలోనే సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్, లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి సహా లిరిక్స్ ఓకే చేసిన త్రివిక్రమ్ మీద ఫైర్ అవుతూ ఒరేయ్(Orey) అనే పదంతో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఏ మాత్రం బాలేదని, తమ మహేష్ సినిమా పాటల మీద ఇంత అశ్రద్ధ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. నిజానికి ఈ సినిమా రెండో పాట రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విధంగా ఫాన్స్ ఫైర్ అయ్యారు. ఫాన్స్ కి రాజజోగయ్య శాస్త్రికి మాటల యుద్ధం జరిగి ఆయన సోషల్ మీడియాకి కూడా దూరం అయ్యారు. ఇప్పుడు మరో సారి ఈ పాట ఓపెనింగ్ వర్డ్స్ తో మళ్ళీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తుండగా.. యువ హీరోయిన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీనాక్షి చౌదరి సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
https://twitter.com/search?q=Orey&src=trend_click&vertical=trends

Exit mobile version