Site icon NTV Telugu

Operation Raavan: సినిమాలకు ఇండస్ట్రీలోనే ఇబ్బందులున్నాయి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Director Vekata Satya Interview

Director Vekata Satya Interview

Operation Raavan Director Intresting Comments at Pre Release Event: పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు మారుతి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో థ్రిల్లర్ అనే ట్యాగ్ లైన్స్ తో ప్రమోషన్ చేస్తున్నాం గానీ మా సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది.

Maldives – India: మాల్దీవుల‌కు భార‌త్ భారీ షాక్.. దురహంకారానికి కళ్లే

ప్రేమ సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమ ఇవ్వడం అనేది ఒక రకంగా ఉంటుంది. ప్రేమ అంతా నాకే కావాలని అనుకున్నప్పుడు మరో రకంగా ఉంటుంది. ఎంత డీప్ ప్రేమ, ఎంత వయలెంట్ గా మారింది అనేది ఈ సినిమాలో తెరకెక్కించాం. మన సినిమాల మనుగడ కష్టమవుతుంది అనే పరిస్థితులకు కారణాలు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఎవరైనా పెద్దవారు ఇండస్ట్రీలో పెద్దగా బాధ్యతలు తీసుకుని మనం థియేటర్స్ లో ఇంత రేట్స్ ఎందుకు పెడుతున్నాం, పాప్ కార్న్ రేట్స్ ఇంతలా పెంచితే సినిమాకు ప్రేక్షకులు వస్తారా లేదా థియేటర్స్ ఒక వారం మూసేసి మరో వారం ఓపెన్ చేస్తున్నారు..ఇలాంటి అంశాలను ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు.

Exit mobile version