యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఓ మై ఆద్యా అంటూ సాగే ఈ ప్రేమ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శర్వా – రష్మిక జంట మధ్య కెమిస్ట్రీ ఫ్రెష్ ఫీల్ ని తెస్తోంది. శ్రీమణి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. రష్మిక ప్రేమ మాయలో శర్వా మునిగి తేలుతున్నట్లు కనిపించాడు. ఇద్దరు కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు సాంగ్ లో చూపించారు.
ఇక యాజిన్ నిజార్ మెస్మరైజింగ్ వాయిస్.. రాజు సుందరం క్యూట్ క్యూట్ స్టెప్స్ తో సాంగ్ మొత్తం లవ్ ఫీల్ తెప్పిస్తోంది. ఇక సాంగ్ లో రష్మిక అందాలు హైలైట్ గా నిలిచాయి. చిట్టి చిట్టి గౌన్ లో అమందు మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ సొంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఫిబ్రవరి 25 అంటే.. ఫిబ్రవరి 24న ‘వలిమై’ – 25న ‘గని’ ‘సెబాస్టియన్’ ‘గంగూబాయి’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరుముఖ్యంగా అదే రోజు భీమ్లా నాయక్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య శర్వా ఫ్యామిలీ కథతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.