NTV Telugu Site icon

Liquor sales: జైలర్ కలెక్షన్స్ ను కూడా చిత్తు చేసిన మందు బాబులు.. 8 రోజుల్లో అన్ని వందల కోట్లు తాగేశారా?

Jailer Collections

Jailer Collections

Onam Liquor Sales Crosses jailer collections in 8 days: మందుబాబులు ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొట్టే విషయంలో ముందే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే న్యూ ఇయర్ కి మందు రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుందో కేరళలో కూడా ఓనం పండుగకి ఈసారి మద్యం అమ్మకాల రికార్డులు బద్దలు అయ్యాయి. నిజానికి కేరళ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ ఓనం. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడికో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు సైతం ఇళ్ళకి తిరిగి వెళ్లి పండుగ పూర్తి చేసుకుని ఉద్యోగాలకి వెళుతూ ఉంటారు. ఇక కొద్దిరోజుల క్రితం జరిగిన ఓనం వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయాలు కూడా దుమ్ము రేపినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఓనం సందర్భంగా కేరళ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ఉత్రాడం రోజు వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే గత ఏడాది రికార్డులను కూడా బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది.

Jailer : జైలర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

ఉత్రాడం రోజు వరకు గడిచిన ఎనిమిది రోజుల్లో బెవ్కో రూ.665 కోట్ల విలువైన మద్యం విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి రూ.624 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంటే ఈసారి 41 కోట్ల విలువైన మద్యం అధికంగా అమ్ముడుపోయింది. ఒక్క ఉత్రాడం రోజునే 121 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 116.2 కోట్ల విలువైన మద్యం కేవలం అవుట్ లెట్ల ద్వారానే విక్రయించబడింది. గతేడాది అవుట్ లెట్ల ద్వారా రూ.112.07 కోట్ల మద్యం విక్రయించారు. మద్యం అమ్మకాలంలో ఈసారి ఇరింగ‌ల‌కుడ‌ ప్ర‌థమంగా నిలిచింది. ఇరింగలకుడలో 06 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ విషయంలో కొల్లం రెండో స్థానంలో ఉంది. కొల్లం ఆశ్రమ ఔట్‌లెట్‌ విక్రయాల్లో కూడా కోటి దాటింది. ఇక్కడ రూ.1.01 కోట్ల విలువైన మద్యం విక్రయించారు.

అయితే ఈసారి మద్యం విక్రయాల్లో చినకనాల్‌ వెనుక పడింది. ఈ సారి ఉత్రాడం నాడు అతి తక్కువ మద్యం విక్రయించిన ఔట్‌లెట్‌గా చినకనాల్‌ పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఉత్రాడం రోజు రూ.6.32 లక్షల విక్రయాలు మాత్రమే జరిగాయి. కాగా, అమ్మకాల ఆదాయంలో మార్పు ఉంటుందని బెవ్కో ఎండీ చెప్పుకొచ్చారు. తుది టర్నోవర్‌ను లెక్కించినప్పుడు అమ్మకాలు మరింత పెరుగుతాయని బెవ్‌కో ఎండీ చెబుతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఓనం మద్యం అమ్మకాలు రజనీకాంత్ జైలర్ సినిమా కలెక్షన్స్ ను దాటేశాయి అని చెప్పక తప్పదు. అదేమంటే జైలర్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 600 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా మద్యం అమ్మకాలు అయితే ఏకంగా ఎనిమిది రోజుల్లో 665 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.