తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Also Read :Ustad Bhagat Singh : డబ్బింగ్’లో బిజీగా పవన్ కళ్యాణ్
హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ. అందరికంటే చివర్లో హీరోనే మాట్లాడాలి. ఇందులో మా హీరో ఈషా. తనే చివర్లో మాట్లాడుతుంది అని పేర్కొన్న ఆయన నిర్మాత సృజన్ నా జూనియర్. తనని ఎప్పుడు చూసినా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. తనకి సినిమా అంటే చాలా పాషన్. ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో ప్రొడ్యూసరే హీరో. ఈ సినిమా నిర్మాతలు అందరికీ హాట్సాఫ్. ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే. ఈషా అంటే నాకు చాలా ఇష్టం. నెట్ ఫ్లిక్స్ లో రాములు చేసినప్పుడు కూడా తనని సంప్రదించాను. అప్పుడు తను వేరే ప్రాజెక్టులో భాగమై ఉన్నారు. శాంతి క్యారెక్టర్ కు తన ప్రాణం పోశారు. తను రియల్ లైఫ్ లో కూడా ఎన్ని ఎలాంటి పరిస్థితులు కూడా చాలా శాంతిగా ఉంటారు. ఈ సినిమాకి హీరో ఈషా. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం ఉంది అందరూ థియేటర్స్ లో వెళ్లి సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. అయితే తరుణ్ భాస్కర్ ఈషా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈషా అంటే నాకు చాలా ఇష్టం అని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
