Site icon NTV Telugu

OLD: పీరియాడిక్ ఓ.ఎల్.డీ.. ఓ సైకో ప్రేమ కథ!

Old Glimpse

Old Glimpse

OLD Concept Glimpse: చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు. దీంతో మేకర్స్ కూడా కంటెంట్ ను నమ్ముకుని సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ కోవలోనే మేము కూడా ఒక సినిమా చేస్తున్నాం అంటున్నారు “ఓ ఎల్ డీ” (OLD) మేకర్స్. రాకేష్ శ్రీపాద దర్శకత్వంలో మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో జి రాణి నిర్మాతగా అల్టిమేట్ సినీ ప్లానెట్ బ్యానర్ మీద ఈ “ఓ.ఎల్.డీ” (OLD) సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2008లో జరిగిన ఒక క్రైమ్ థ్రిల్లర్ కథను పీరియాడిక్ మూవీగా తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ చెబుతున్నారు.

Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్!

అలాగే షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి జూన్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక కాన్సెప్ట్ గ్లింప్స్ వీడియో చూస్తే ఇది ఓ సైకో ప్రేమ కథలా కనిపిస్తోంది. ఈ సినిమా దర్శకుడు రాకేష్ శ్రీపాద మాట్లాడుతూ “ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2008 టైం పీరియడ్ లో జరిగే కథ, మా చిత్రానికి “ఓ ఎల్ డి” టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నా, మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని అన్నారు. అనిల్ చౌదరి కెమెరా మాన్ గా వ్యవహరించనున్న ఈ సినిమాకి రాధా శ్రీధర్ ఎడిటర్. అనీష్ రాజ్ దేశముఖ్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాకేష్ శ్రీపాద అందిస్తున్నారు. హీరోయిన్ సహా ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Exit mobile version