Site icon NTV Telugu

Okkadu: మహేశ్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్న భూమిక, గుణశేఖర్!

Okkadu Team

Okkadu Team

 

ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ‘పోకిరి’ సినిమాను 175 కు పైగా స్క్రీన్స్ లో ఇవాళ ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఇదే రోజున మహేశ్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఒక్కడు’ సినిమాను సైతం కొందరు అభిమానులు వివిధ కేంద్రాలలో ప్రదర్శించారు. హైదరాబాద్ ప్రసాద్స్ లోని బిగ్ స్క్రీన్ లో ఈ రోజు ఉదయం ‘ఒక్కడు’ సినిమాను వేశారు. ఈ స్పెషల్ షోకు డైరెక్టర్ గుణశేఖర్ తో పాటు హీరోయిన్ భూమిక సైతం హాజరయ్యారు. అభిమానుల మధ్య ‘ఒక్కడు’ సినిమాను బిగ్ స్క్రీన్ లో చూసిన అనంతరం అదే ఆవరణలో మహేశ్ బాబు అభిమానుల మధ్య బర్త్ డే కేక్ ను కట్ చేశారు. ‘ఒక్కడు’ సినిమా స్పెషల్ షోను స్క్రీనింగ్ చేయించిన మహేశ్ బాబు అభిమానులకు గుణశేఖర్, భూమిక అభినందనలు తెలిపారు. ఆ కార్యక్రమం ఫోటోలు, వీడియోస్ ను వీరిరువురూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Exit mobile version