Site icon NTV Telugu

OG: సెప్టెంబర్ 2న కన్నా ముందే OG బాంబ్ బ్లాస్ట్ అవ్వనుంది

Pawan Kalyan Og

Pawan Kalyan Og

ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది. ‘దే కాల్ హిమ్ OG’ అనే టైటిల్ ని సుజిత్ అండ్ టీం లాక్ చేసారని సమాచారం. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున సెప్టెంబర్ 2న టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం OG సినిమాపై ఉన్న అంచనాలని బట్టి చూస్తే సోషల్ మీడియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ OG టీజర్ బయటకి రాగానే చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.

టీజర్ రిలీజ్ సెప్టెంబర్ 2నే ఉంటుంది కానీ అంతకన్నా ముందు OG హైప్ ని ఆకాశానికి చేరుస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానుందని సమాచారం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో OG ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓజి అవుట్ డోర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఓజి అంటే ‘ఓజస్ గంభీర’ అని తెలుస్తోంది. దాన్నే షార్ట్‌గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా మార్చారని సమాచారం. అయితే ‘ఓజస్ గంభీర’ అనేది.. సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఓజి అనే టైటిల్ మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. మరి దీన్నే టైటిల్ గా ఉంచుతారా లేక ‘దే కాల్ హిమ్ OG’ టైటిల్ ని లాక్ చేసి అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version