Site icon NTV Telugu

OG: ‘ఓజీ’ స్పెషల్ సాంగ్ రిలీజ్..నేహా శెట్టి ఎంట్రీతో థియేటర్లలో జోష్ రెట్టింపు

Nehashetty

Nehashetty

గత వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డులు సృష్టించిన  చిత్రం ‘OG’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి సినిమాకు అదిరే రెస్పాన్స్ అందిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మొదటి వీకెండ్‌లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. .ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స‌రికొత్త‌ అవతారంలో కనిపించగా, ఆయన నటనకు విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఈవెనింగ్ షో నుండి, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ స్పెషల్ సాంగ్ థియేటర్లలో రిలీజ్ చేశారు.

Also Read : Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పడుకోన్‌

ఈ కొత్త సాంగ్, కథలో ఓజీ గాయపడిన సందర్భంలో ఓమీ గ్యాంగ్ సెలబ్రేట్ చేసే సన్నివేశంలో ప్లేస్ చేయబడింది. ఫ్యాన్స్ ఈ పాటను చూసి పాత రోజుల గబ్బర్ సిగ్ డేస్ ని గుర్తుచేసుకుంటూ, థియేటర్లలో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. నేహా శెట్టి ఎంట్రీతో పాటకు అదనపు ఆకర్షణ ఏర్పడినది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లను సాధారణ స్థాయికి తీసుకురావడంతో, థియేటర్ ఆవరణలో ప్రేక్షకుల ఉత్సాహం మరింత పెరిగింది. కొత్త స్పెషల్ సాంగ్‌తో OG సినిమాకు థియేటర్లలో జోష్ రెట్టింపు అవుతూ, సినిమాపై ఫ్యాన్స్ ఆకర్షణను కొనసాగిస్తుంది.

Exit mobile version