పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసిందనే చెప్పాలి.
Also Read : Lokesh Aamir Film : కూలీ ఎఫెక్ట్.. అమీర్ ఖాన్.. లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే OG ఫీవర్ కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఎక్కడ చుసిన పవర్ స్టార్ OG సినిమా గురించి ఒకటే హంగామా. అక్కడ రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతుంది ఓజి. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 1.25 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కేవలం అడ్వాన్సు బుకింగ్స్ లోనే రాబట్టింది. రిలీజ్ కు ఇంకా 15 రోజులు ఉండగా ఈ వసూళ్లు రాబట్టడం పవన్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తోంది. ఇక బుకింగ్స్ పరంగాను OG విధ్వంసం చేస్తున్నాడు. నార్త్ అమెరికా లో అడ్వాన్సు బుకింగ్స్ టికెట్స్ లోను ఓజి హంటింగ్ చేస్తున్నాడు. నార్త్ అమెరికాలో 45,000కు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ విషయని అఫీషియల్ గా ప్రకటించారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్. భారీ హైప్, భారీ అంచనాలు ఉన్న ఓజి ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది. రిలీజ్ నాటికి ఓజి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో.
