Site icon NTV Telugu

OG: ఓజీ మూవీ ప్రీమియర్స్‌లో..స్క్రీన్‌ను చింపి అభిమానుల రచ్చ..

Og (2)

Og (2)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “OG” మూవీ ప్రీమియర్స్ సమయంలో బెంగళూరు థియేటర్‌లో అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. KR పూర్ ప్రాంతంలోని ఒక ప్రముఖ థియేటర్‌లో ప్రత్యేక షో మద్యలో కొంత మంది క్రేజీ ఫ్యాన్స్ సినిమాకు సంబంధించిన కత్తిని తెచ్చి స్క్రీన్‌ను చింపారు. ఈ కారణంగా షోను తాత్కాలికంగా నిలిపివేశారు. సినిమా ప్రీమియర్స్‌లో అభిమానుల ఉత్సాహం సాధారణం కాగా, కత్తులు, ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకురావడం భద్రతకు ముప్పుగా మారింది. థియేటర్ యాజమాన్యం ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను పెంచారు.

Also Read : OG : ఓజి మూవీపై చిరంజీవి ట్వీట్ వైరల్..

సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్ కాగా, ఫ్యాన్స్, మీడియా, సినీ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. OG మూవీకి అభిమానుల క్రేజీ ప్రేమ ఉండకపోవడంలేదు, అయితే భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటివి భవిష్యత్తులో తప్పించుకోవడం అవసరం అని యాజమాన్యం సూచించింది.

Exit mobile version