పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం OG. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
Also Read : OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. OG ప్రీమియర్స్ క్యాన్సిల్
ఈ నేపధ్యంలో OG ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి కూడా హాజరుకానున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా రాబోతున్నట్టు సమాచారం. ఈ వేడుకను కనివిని ఎరుగని రీతిలో చేసేందుకు పప్లాన్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ తో పాటు ఆంధ్రాలోను మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు ప్లానింగ్ లో ఉంది. ఈ ఈవెంట్ ను విజయవాడ లో లేదా వైజాగ్ లో చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అనుమతులు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున షోస్ వేసేందుకు థియేటర్స్ అగ్రిమెంట్స్ చేస్తున్నారు. OG తో ఇండస్ట్రీ రికార్థులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్.
