సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. సన్ పిచ్ర్స్ నిర్మించిన ఈ సినిమా నిన్న ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ 2 తో పోటీగా రిలీజ్ అయింది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలు నువ్వా.. నేనా? అనేలా పోటీ పడ్డాయి. అయితే లోకేష్ కనకరాజ్ క్రేజ్ తో పాటు రజినీ మాస్ పవర్ తోడవడంతో కూలీ మొదటి రోజు అదరగొట్టింది.
Also Read : Venky77 : వెంకీ మామ – త్రివిక్రమ్.. పూజ కార్యక్రమలతో మొదలెట్టేసారు
మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చూస్తే రజనీకాంత్ కూలీ మూవీకి ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో తమిళ్ నుంచి రూ. 45 కోట్లు, తెలుగు నుంచి రూ. 15 కోట్లు, హిందీలో రూ. 4 కోట్లకు పైగా వచ్చినట్టు ట్రేడ్ అంచనా వేసింది. అయితే కూలీ మేకర్స్ అయిన సన్ పిచర్స్ రూ. 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు అఫీషియల్ గా ప్రకటించింది. ఈ వసూళ్లతో మరో రికార్డు క్రియేట్ చేసాడు రజనీ. ఇప్పటి వరకు తమిళ సినిమా చరిత్రలో మొదటి రోజు హయ్యెస్ట్ గ్రాస్ కలక్షన్స్ రాబట్టిన సినిమాగా కూలీ రికార్డ్ సొంతం చేసుకుంది. రజనీకాంత్ రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాదు రికార్డ్స్ బద్దలు కొడతాడు అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ నటించిన కూలీ మొదటి రోజుతో పాటు రెండవ రోజు కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రాబడుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కోలీవుడ్ ఇండస్ట్రీ డ్రీమ్ అయినటువంటి వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవడం కష్టమేమి కాదు.
