O Sukumari OTT Deal: ‘ఓ..! సుకుమారి’కి ఓటీటీలో క్రేజ్.. రిలీజ్‌కు ముందే రైట్స్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
O Sukumari OTT Deal: థియేటర్లలోకి అడుగుపెట్టక ముందే ఓటీటీ మార్కెట్లో భారీ డీల్ దక్కించుకోవడం ఇప్పుడు సాధారణ విషయమే అయినా, కొత్త తరహా కథలతో వస్తున్న చిత్రాలకు ఇలాంటి ఆదరణ లభించడం విశేషంగా మారుతోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ముందుగానే హక్కులు సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరింది తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ..! సుకుమారి’. థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఈ నెల 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండటమే కాకుండా, కథను కూడా ఆయనే అందించడం విశేషం. ఈ చిత్రం తిరువీర్ కెరీర్లో పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. గతంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఇప్పుడు తొలిసారిగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఐశ్వర్య రాజేష్ కూడా విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కావడంతో, ఈ జంట తెరపై ఎలా కనిపించబోతుందనే ఆసక్తి అయితే అభిమానుల్లో ఉంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుండగా, స్ట్రీమింగ్ తేదీని మాత్రం విడుదల అనంతరం అనౌన్స్ చేయనున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అమనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ మంచిరాజు సంగీతం అందిస్తుండగా, గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకునే అంశాలతో రూపొందినట్లు తెలుస్తోంది. ఇటీవల చిన్న, మధ్యస్థాయి సినిమాలకు కూడా ఓటీటీ మార్కెట్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ హక్కులు కూడా నిర్మాతలకు ఆర్థిక కష్టాలను గట్టెక్కించే వనరుగా మారుతోంది. ఇప్పుడు ‘ఓ..! సుకుమారి’ కూడా విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ హక్కులను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకులతో పాటు, సినీ వర్గాల్లో కూడా మరింత పెరిగింది.
- Tags
- Amazon Prime Video
- cinema
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..