Site icon NTV Telugu

Nuvvu Nenu: గుండెల్ని పిండే ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీ రిలీజ్.. గెట్ రెడీ

Nuvvu Nenu Movie Re Release: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం అనూహ్యంగా అందరికీ దూరం అయ్యారు. ఇక ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో మరచిపోలేని ముద్ర వేసుకున్నాడు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఆయన నటించిన నువ్వు నేను అనే సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా … టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.

Dulquer Salmaan: సీనియర్ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న దుల్కర్ సల్మాన్

పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయి మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి, ఇక అలా చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో ఒక స్లైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు రీ రిలీజ్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీని ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈమేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version