NTV Telugu Site icon

Anushka Shetty: ఎవడ్రా స్వీటీ రేంజ్ పడిపోయింది అంది.. వస్తుంది చూడు

Anushka

Anushka

Anushka Shetty: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెర మీద మెరిసింది లేదు. అనుష్క కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యనే అనుష్క లుక్ ను చూసి చాలా ట్రోల్స్ చేసిన విషయం తెల్సిందే. స్వీటీ చాలా బొద్దుగా మారిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆమె పని అయిపోయిందని, ఆమె రేంజ్ పడిపోయిందని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఇక చాలా కాలం తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబుపి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో సందడి చేయనుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు మహిళా దినోత్సవ సందర్భంగా అనుష్క కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Nani: భార్యా బాధితుడనని ఈ పాట రూపంలో చెప్పావా భయ్యా

ఇక పోస్టర్ లో అనుష్క అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది. లండన్ వీధుల్లో ఆమె నడుస్తూ కనిపించింది. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ అనుష్క.. నేను మహిళను.. మీ సూపర్ పవర్ ఏంటి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట టట్రెండింగ్ గా మారింది. స్వీటీ ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తుంది అనడానికి ఈ ఒక్క పోస్టర్ సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పోస్టర్ చూశాక స్వీటీ అభిమానులు.. ట్రోలర్స్ పై విరుచుకుపడ్డారు. ఎవడ్రా స్వీటీ రేంజ్ పడిపోయింది అంది.. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిత్రంతో స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments