Site icon NTV Telugu

సర్జరీ తరువాత ఆమెతోనే ఎన్టీఆర్ ఫస్ట్ పిక్… వైరల్

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక అందం, అభినయంలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ పోలికని, ఎన్టీఆర్ నట వారసుడని నందమూరి అభిమానులు మురిసిపోతారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సర్జరీ తరువాత ఎన్టీఆర్ ఫస్ట్ పిక్ బయటకు వచ్చింది. ఆ పిక్ ఒక వృద్ధురాలితో ఉండడం విశేషం. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also : విజయ్ సేతుపతిని తంతే నగదు బహుమతి… హిందుత్వ సంస్థ షాకింగ్ ప్రకటన !!

ఆ చిత్రంలో తారక్ కుడి చేతికి కట్టు కన్పిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ కుడి చేతికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ హీరో తన జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు మణికట్టుకు గాయమైంది. శస్త్రచికిత్స చిన్నదే కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కోలుకుంటున్నాడు. ఇక తాజా ఫోటోలో మన స్టార్ హీరో ఎన్టీఆర్ ఓ సీనియర్ మహిళా అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. తారక్‌ని స్వయంగా దగ్గరగా తీసుకుని ఫోటో దిగడంతో ఆ బామ్మ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.

Exit mobile version