Site icon NTV Telugu

NTRNeel : ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు

Ntrneel

Ntrneel

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత నెల 22న యంగ్ టైగర్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టాడు.

Also Read : Manchu : ‘అత్తరుసాయిబు’ గా వస్తున్న యంగ్ హీరో

రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కర్ణాటకలో ముగిసింది. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెకుతున్న ఈ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేసాడు ప్రశాంత్ నీల్. ఈ ఫైట్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయట. కొద్దీ రోజులు షూటింగ్ గ్యాప్ తర్వాత సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కాగా ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ మరో ముఖ్య పాత్రలో నటించనున్నాడు. మరోవైపు ఈ సినిమా రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ ను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాడు. కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 25 జూన్ 2026 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version