ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్ గా నటిస్తే ఎలా ఉంటుందో? ఆ నెగటివ్ షెడ్ ని ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టెంపర్ సినిమాలోని ఎవిల్ స్మైల్ ఎన్టీఆర్ విలనిజానికి చిన్న శాంపిల్ మాత్రమే.
జై లవ కుశ సినిమాలోని ‘జై’ క్యారెక్టర్ తో నెగెటివ్ రోల్‌లో భీభత్సమే సృష్టించాడు తారక్. ఇంకో రెండు క్యారెక్టర్స్ ఉన్నా కూడా ‘జై’ మాత్రమే ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతాడు అంటే తారక్ ఇచ్చిన నెగటివ్ టచ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తనతో తాను పోటీ పడితేనే ఎన్టీఆర్ ఈ రేంజ్ విలనిజం చూపించాడు అదే మరో స్టార్ హీరోతో టైగర్ తలపడితే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది.
యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ vs హ్రితిక్ రోషన్ మధ్య జరగబోయే యుద్ధం క్లాష్ ఆఫ్ టైటాన్స్ లా ఉంటుంది. స్క్రీన్ పైన రెండు మద గజాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ ఫైట్ చేస్తే అలానే ఉంటుంది, ఈ ఇద్దరూ డాన్స్ చేసినా నటరాజు డబుల్ రోల్ లో డాన్స్ చేసినట్లు ఉంటుంది. వార్ 1 సినిమాలో టైగర్ ష్రాఫ్ నెగటివ్ రోల్ ప్లే చేశాడు కానీ హ్రితిక్ రోషన్ ముందు ఆనలేదు. పెర్ఫార్మెన్స్ లో టైగర్, హ్రితిక్ ముందు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వార్ 2 విషయంలో మాత్రం హ్రితిక్ రోషన్ కి ఈ విషయంలో గట్టి పోటీ ఎదురవ్వనుంది. హ్రితిక్ రోషన్ అనే కాదు ఒక్కసారి ఎన్టీఆర్, యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి ఎంటర్ అయితే రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్ vs ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ vs ఎన్టీఆర్ లాంటి కాంబినేషన్స్ ని కూడా చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హ్రితిక్ రోషన్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ హీరోలకి అపోజిట్ లో సరైన విలన్ ఇప్పటివరకూ లేడు.
టైగర్ సీరీస్ లో రెండు సినిమాలకి ఇద్దరు విలన్లు ఉన్నారు, షారుక్ కి జాన్ అబ్రహమ్ విలన్ గా కనిపించాడు కానీ ఈ క్యారెక్టర్ కి పఠాన్ సినిమాతోనే ఎండ్ కార్డ్ వేశారు. హ్రితిక్ రోషన్ కి టైగర్ ష్రాఫ్ విలన్ రోల్ ప్లే చేశాడు, ఇతని క్యారెక్టర్ కూడా వార్ 1 సినిమాతోనే ఎండ్ అయ్యింది. సో ఇప్పుడున్న టైం లైన్ ప్రకారం యష్ రాజ్ స్పై యూనివర్స్ లో హీరోలు ఉన్నారు కానీ విలన్ లేడు. ఎన్టీఆర్ రాకతో ఒక సాలిడ్ విలన్ యూనివర్స్ లోకి ఎంటర్ అయ్యాడు. మేకర్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే థానోస్ vs అవెంజర్స్ రేంజులో సాలిడ్ సినిమా పడే ఛాన్స్ ఉంది. మరి ఫ్యూచర్ లో యష్ రాజ్ స్పై యాక్షన్ యూనివర్స్ లో ఎన్టీఆర్ ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చే రోల్ ప్లే చేస్తాడో చూడాలి.