Site icon NTV Telugu

Dadasaheb Phalke : ఎన్టీఆర్ vs అమీర్ ఖాన్.. బయోపిక్ వార్?

Ntr Vs Amir

Ntr Vs Amir

ఒకేరోజు గంటల వ్యవధిలో బాలీవుడ్ నుంచి రెండు బిగ్ అప్డేట్స్ వచ్చాయి.  భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టుగా కథనాలు వచ్చాయి. రాజమౌలి పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుందని వార్తలు వెలువడ్డాయి.  కానీ ఆ వెంటనే, అదే బయోపిక్‌ను అమీర్ ఖాన్ చేస్తున్నట్టుగా మరో ప్రకటన వచ్చింది. దీంతో  అసలు ఈ బయోపిక్ ఎవరు చేస్తున్నారు? అనే డైలమాలో పడిపోయారు నెటిజన్స్.

Also Read : Kamal Haasan : తెలుగులో భారీ ఎత్తున థగ్ లైఫ్ ప్రమోషన్స్

వాస్తవానికి రాజమౌళి రెండేళ్ల క్రితం తన సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ సినిమాను ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్‌ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. కానీ హీరో ఎవరనే విషయాన్ని చెప్పలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ నటించనున్నట్లు ఫీలర్స్ వదిలారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అమీర్ ఖాన్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ చేస్తున్నాడని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్నట్టుగా బాలీవుడ్ మీడియా తెలిపింది.

గత నాలుగేళ్లుగా ఈ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు ఈ బయోపిక్ వార్ ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్‌గా మారిపోయింది. ఈ  బయోపిక్‌ను ఎన్టీఆర్‌, అమీర్ ఖాన్‌  ఎవరి వెర్షన్‌లో వారు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇద్దరు దర్శక దిగ్గజాలు ఒకే బయోపిక్‌ను రెండు వెర్షన్స్ లో తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అనే వాదన వినిపిస్తోంది. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి దాదాసాహెబ్ కు గ్రాండ్ ట్రిబ్యూట్ గా ఈ సినిమాను రూపొందిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version