NTV Telugu Site icon

Jr. NTR : సైఫ్ అలీఖాన్ పై జరిగిన ఘటనపై స్పందించిన ఎన్టీఆర్

Saif

Saif

బాలీవుడ్‌ ఖాన్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీఖాన్‌ పై ఈ తెల్లవారు జామున దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. గురువారం ఉదయం 2.30 గంటలకు సైఫ్ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అలీఖాన్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సైఫ్ పై ఆరుచోట్ల కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్‌ కు సుమారు 6 కత్తి పోట్లు దిగినట్టు తెలుస్తోంది. దింతో కుటుంబసభ్యులు వెంటనే సైఫ్ ను ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు.

Also Read : Manchu Family : మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ కారుపై దాడి

సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిందని తెలియడంతో అయన ఫ్యాన్స్ ఆందోళ చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలి దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పలువురు స్టార్ హీరోలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంశిస్తు పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ మాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పదించారు. ఎన్టీఆర్ స్పందిస్తూ ‘ సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసాడు తారక్. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు ముంబై పోలీసులు.

Show comments