NTV Telugu Site icon

RRR: ఆ రోజుల్లోనే ‘RRR’ కాంబినేషన్.. వీడియో వైరల్

Ntr

Ntr

RRR: ఆర్ఆర్ఆర్ అనగానే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ గుర్తొస్తారు. కానీ, వీరికన్నా ముందే ఒక ఆర్ఆర్ఆర్ త్రయం ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. వారే సీనియర్ రామారావు.. రాఘవేంద్ర రావు.. రామానాయుడు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో ఈ వీడియో బయటపడింది. ఇక ఈ వీడియోలో ఈ ఆర్ఆర్ఆర్ త్రయం ఓకే వివాహానికి హాజరు అయ్యారు. అక్కడ ముగ్గురు పక్కపక్కనే కూర్చొని బొనజం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తరువాత అభిమానులు అసలు సిసలైన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం అంటే ఇదే.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియోను డైరెక్టర్ రాఘవేంద్రరావు షేర్ చేస్తూ.. ఆ వీడియోను వెతికి ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు.

Siddharth: తారక్, మహేష్.. మధ్యలో సిద్దార్థ్ ఎవడు.. వీడేం చేస్తున్నాడు అంటారు
ఇకపోతే ఈ ఆర్ఆర్ఆర్ త్రయం ఒక్క సినిమా అయినా తీయలేదు. రాఘవేంద్ర రావు- ఎన్టీఆర్ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. రామానాయుడు- ఎన్టీఆర్ కాంబోలో.. కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ కాంబోలో ఒక సినిమా వచ్చి ఉండి ఉంటే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుకున్నట్లు అప్పుడు ఆర్ఆర్ఆర్ కాంబోలో వచ్చిన సినిమా గురించి మాట్లాడుకొనేవాళ్ళం. ఏదిఏమైనా ఇలాంటి అరుదైన వీడియో చూడడం మాత్రం కన్నుల పండుగగా ఉందని కొందరు చెప్తుండగా.. వీరి మనవళ్లతో నైనా ఒక సినిమా తీయండి రాఘవేంద్ర రావు గారు అంటూ మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments