Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కొంతమంది విరాళాలు సేకరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు బుధవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ గారి పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చారిటీ పేరుతో భారీగా విరాళాలు సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ ఆఫీస్ పేర్కొంది. అయితే, ఈ తరహా కార్యక్రమాలకు ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన వీటిని ఏ విధంగానూ ఆమోదించడం లేదని, ఇవి పూర్తిగా అనధికారికమని తేల్చి చెప్పింది.
ఎన్టీఆర్ గారితో లేదా ఆయన కార్యాలయంతో సంబంధం ఉన్నట్లుగా నమ్మిస్తూ సాగిస్తున్న ఇటువంటి కార్యకలాపాలకు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని ప్రజలను, శ్రేయోభిలాషులను కోరారు. అభిమానులు అప్రమత్తంగా ఉండి మోసపోకుండా ఉండాలని సూచించారు. సామాజిక కార్యక్రమాలు లేదా ఏదైనా ముఖ్యమైన ప్రకటనలు ఉంటే నేరుగా ఎన్టీఆర్ గారి ద్వారా లేదా ఆయన అధికారిక కార్యాలయం ద్వారా మాత్రమే వెల్లడించబడతాయని ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వర్గాల నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు ఎటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అభిమానులు చూపుతున్న నిరంతర ప్రేమకు, అందిస్తున్న సహకారానికి ఎన్టీఆర్ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!