NTV Telugu Site icon

NTR: ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా.. అదరగొట్టేశాడు అంతే

Ntr

Ntr

NTR:స్టార్ హీరోలు ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఓపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు చాలా రేర్ గా హీరోలు ఈ యాడ్స్ చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి హీరో యాడ్స్ లో కనిపిస్తూ కొత్త బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు, నాగార్జున తరువాత ఎక్కువ యాడ్స్ లో మెరిసింది ఎన్టీఆర్. ఇప్పటికే ఆయన ఆపిల్ ఫీజ్, మెక్ డొనాల్డ్స్ లాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన ఎన్టీఆర్ తాజాగా మలబారు గోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. తాజాగా ఈ జ్యువెల్లరీ యాడ్ లో ఎన్టీఆర్ కనిపించాడు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంటుంది.

Nagarjuna: ఆ కుర్ర రచయిత సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్.. ఎందుకంటే?

చెల్లి పెళ్లి కోసం నగలు కొనాలి, తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి.. అందరిని హ్యాపీగా ఉంచాలి అని అనుకొనే అన్నయ్యకు ఫ్రెండ్ గా ఎన్టీఆర్ కనిపించాడు. అతనిని.. మలబార్ గోల్డ్ జ్యువెల్లరీ షాప్ కు తీసుకెళ్లి కుటుంబానికి నచ్చిన నగలను తీసుకొనేలా చేస్తాడు. చివరిలో ఇక్కడ ఎలాంటి తరుగు ఉండదని, తక్కువ ధరలోనే అన్ని ఆభరణాలు తీసుకోవచ్చని చెప్పుకు రావడంతో ఆ కుటుంబం అంతా తారక్ కు థాంక్స్ చెప్తుంది. ఇక నా కుటుంబం..నా సంబురం.. నా మలబార్ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో యాడ్ ముగిసింది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో లో తారక్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే కొద్దిగా ఈ వీడియోలో ఎన్టీఆర్ బొద్దుగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ ఈ లుక్ లోనే కనిపిస్తున్నాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Show comments