రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ కొడతాడు అని నమ్మిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టింది సలార్ సీజ్ ఫైర్ సినిమా. థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా… ఓటీటీలో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇండియన్ ఆడియన్స్ నే కాదు వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా సలార్ సినిమా ఫిదా చేస్తోంది. ప్రభాస్ కటౌట్ చూసి ఇంగ్లీష్ ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ రేంజ్ సినిమాని ప్రభాస్ కి ఇచ్చిన ప్రశాంత్ నీల్… నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం కన్ఫ్యూస్ అవుతున్నట్లు ఉన్నాడు. KGF 3, సలార్ 2, ఎన్టీఆర్ 31… ఇలా సాలిడ్ ప్రాజెక్ట్స్ ప్రశాంత్ నీల్ లైనప్ లో ఉన్నాయి కానీ ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. షెడ్యూల్ ప్రకారం అయితే సలార్ సీజ్ ఫైర్ తర్వాత ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్లేస్ లో సలార్ 2నే స్టార్ట్ అవుతుంది అనే మాట వినిపిస్తోంది.
ఎన్టీఆర్ 31, సలార్ 2 సినిమాల్లో ఏది ముందుగా స్టార్ట్ అవుతుంది అనే అయోమయంలో ఆడియన్స్ ఉండగా… ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సడన్ మీటింగ్ పెట్టుకున్నారట. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లు ఇటీవలే ఎన్టీఆర్ ఇంట్లో మీట్ అయ్యారని సమాచారం. ఈ మీటింగ్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంపై ఎన్టీఆర్-నీల్ డిస్కస్ చేశారట. దీంతో… త్వరలో ఎన్టీఆర్ 31 షూటింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే కొంత వరకు సలార్ 2 షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి… ఎన్టీఆర్ 31 ఈ ఇయర్ ఎండింగ్‌లో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు చేయని పాత్రను, డిఫరెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే… ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.