NTV Telugu Site icon

NTR: వెరైటీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ తో ఎన్టీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ…

Ntr

Ntr

గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘ఎన్టీఆర్’. ట్విట్టర్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ పేరు టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం, ఇన్నేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ సాధించని ఘనతని ఎన్టీఆర్ సాధించడమే. వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రీడిక్షన్స్ లో ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నాడు. ఇండియా నుంచి ఈ ఫీట్ సాదించిన మొట్టమొదటి యాక్టర్ గా ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ ఫోటో బయటకి వస్తేనే సోషల్ మీడియాలో సందడి చేసే నందమూరి ఫాన్స్, ఎన్టీఆర్ ఎవరూ ఇప్పటివరకూ సాధించనిది అందుకుంటే సైలెంట్ గా ఉంటారా? నో వే కదా. అందుకే వాళ్లు ఎన్టీఆర్ పేరుతో ట్విట్టర్ ని కుదిపేసారు. తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి ట్రెండ్ అవుతుంది ఇందుకు కారణం ఎన్టీఆర్, వెరైటీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ ‘క్లేటన్ డావిస్’ని కలవడమే. క్లేటన్ డావిస్, వెరైటీ మ్యాగజైన్ ని ‘ది టేక్’ అనే షో చేస్తాడు, ఎన్నో అవార్డ్స్ ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తూ ఉంటాడు, అవార్డ్ ప్రిడిక్షన్స్ ని చేస్తూ ఉంటాడు.

ప్రీడిక్షన్స్ లో మోస్ట్ రిలయబుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న క్లేటన్ డావిస్, ఎన్టీఆర్ ని ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశాడు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్, క్లేటన్ డావిస్ లు కలిసిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఆస్కార్ ప్రీడిక్షన్స్ లో చోటు సాధించిన మొదటి ఇండియన్ కావడంతో క్లేటన్ డావిస్, ఎన్టీఆర్ ని స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. మరి ఈ పోడ్కాస్ట్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? దీన్ని మన వాళ్లు ఎక్కడ ఎలా వినాలి అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, జనవరి 9న TCL చైనీస్ థియేటర్ లో జరగనున్న ‘ఆర్ ఆర్ ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరుకానున్నాడు. చరణ్, రాజమౌళిలతో పాటు ఎన్టీఆర్ కూడా అటెండ్ అవ్వనున్న ఈ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత Q&A సెషన్ జరగనుంది. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ ఏం మాట్లాడుతాడు అనేది చూడాలి.