NTV Telugu Site icon

Nandamuri Family: తాతకి తారక్ నివాళి… జై ఎన్టీఆర్ నినాదాలతో దద్దరిల్లిన ఎన్టీఆర్ ఘాట్

Ntr

Ntr

విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారకరామారావు వర్ధంతి నేడు. యావత్ తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. తెలుగు జాతి గర్వంగా, తెలుగు జాతి ప్రతీకగా నిలిచిన అన్నగారి వర్ధంతి సంధర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. తాతకి నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ఎన్టీఆర్ ఘాట్ కి తెల్లవారుఝామునే వెళ్లారు. ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు అర్పించి, నమస్కరించి తిరిగి వెళ్లిపోయారు. అప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఉండడంతో ఎన్టీఆర్ ని చూడగానే అభిమానులు ఫోటోస్ తీసుకోవడానికి ఎగబడ్డారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాస్త రద్దీ ఏర్పడింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు జై ఎన్టీఆర్ నినాదాలు చేసారు.

Read Also: Mahesh – Rajamouli : తన సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన జక్కన్న..ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..

సోషల్ మీడియాలో కూడా నందమూరి తారక రామారావు అభిమానులు, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు… #NTRLivesOn ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ అన్నగారు నటించిన సూపర్ హిట్ సినిమాల వీడియోలను, ఎడిటెడ్ ఫోటోలను, గుక్క తిప్పుకోకుండా చెప్పిన డైలాగులని పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. అన్నా తెలుగు జాతి మరువదు నీ ఘనత అంటూ నందమూరి అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

Read Also: Hanuman: ఆల్ టైమ్ టాప్ 10 మూవీస్ లిస్టులో చేరిపోయిన సూపర్ హీరో సినిమా