NTV Telugu Site icon

Amigos: ఎన్టీఆర్ వచ్చేసాడు… ఎన్టీఆర్ స్పెషల్ AV అదిరిపోయింది

Amigos Event

Amigos Event

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్న అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ లెవల్లో అరేంజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చిన అమిగోస్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లని చూడడానికి నందమూరి అభిమానులు క్యు కట్టడంతో JRC ఫుల్ ప్యాక్ అయ్యింది. సుమ కనకాల హోస్ట్ గా చేస్తున్న ఈ ఈవెంట్ కి బుచ్చిబాబు, వసిష్టలు కూడా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ మెడ్లీ, కళ్యాణ్ రామ్ మెడ్లీ, ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు జరిగాయి.

నందమూరి అభిమానులు సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది జరిగిన కాసేపటికే ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు, దీంతో JRC కన్వెన్షన్ మొత్తం జై ఎన్టీఆర్ నినాదంతో మోతమోగిపోయింది. వైట్ టీషర్ట్ లో ఎన్టీఆర్, ఫుల్ బియర్డ్ లుక్ లో రగ్గడ్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడు. చిత్ర యూనిట్ ప్రతి ఒక్కరినీ పలకరించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పక్కన కూర్చోన్నాడు. అన్నదమ్ములు ఒకటే ఫ్రేమ్ లో కనిపించే సరికి కాసేపు JRC టాపు లేచి పోయే రేంజ్ లో హంగామా చేశారు నందమూరి అభిమానులు. ఈ సమయంలో ప్లే చేసిన ఎన్టీఆర్ స్పెషల్ AV అయితే సూపర్బ్ గా కట్ చేశారు అనే చెప్పాలి. ఎన్టీఆర్ కెరీర్ లోని మెయిన్ హైలైట్స్ ని, ఎన్టీఆర్ గురించి ఇతర స్టార్స్ చెప్పిన విషయాలని పర్ఫెక్ట్ గా కట్ చేసిన ఈ AVకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.