NTV Telugu Site icon

NTR: ‘దేవర’ కోసం ఆ రిస్క్ చేయబోతున్న ఎన్టీఆర్..?

Devara

Devara

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సముద్ర వీరుడుగా కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కాబట్టి అందరు ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. క్యాస్టింగ్ దగ్గరనుంచి సీన్ల వరకు.. అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. నిజం చెప్పాలంటే.. ఎన్టీఆర్ కు, కొరటాలకు ఈ సినిమా విజయం అత్యంత అవసరం. ఎన్టీఆర్.. రాజమౌళి సినిమా తరువాత హిట్ కొట్టి బ్రేక్ ఇవ్వడానికి పోరాడుతుంటే.. కొరటాల.. ఆచార్య ఫ్లాప్ నుంచి బయటపడాలని చూస్తున్నాడు. అందుకే ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా చేస్తున్నారట.

Shaitan Review: సైతాన్ (వెబ్ సిరీస్)

ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద రిస్క్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను త్వరలో హైదరాబాద్ లో మొదలుపెట్టనున్నారట. యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారని టాక్. ఈ సీన్స్ కోసం ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున ఫైట్స్ చేయనున్నాడట. అది కూడా డూప్ లేకుండా.. ఈ ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలవనుందని సమాచారం. విలన్ సైఫ్ కు ఎన్టీఆర్ కు మధ్య సముద్రపు ఒడ్డున భీకర ఫైట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నేచురాలిటీ మిస్ కాకుండా ఉండడం కోసం డూప్ లేకుండా ఎన్టీఆర్ నే రిస్క్ చేసి ఈ సీన్స్ ను కంప్లీట్ చేయనునున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా తో ఎన్టీఆర్ అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది చూడాలి.