కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఇటీవలే ఫ్యాన్స్ ఇంట్రాక్షన్స్ సెషన్ చేసాడు. ఇందులో ఒక ఫ్యాన్…. దేవర గ్లింప్స్ చూసారా అని అడిగింది… దీనికి కిచ్చా “అఫ్ కోర్స్ చూసాను… ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ” అంటూ రిప్లై ఇచ్చాడు. ఎన్టీఆర్ కి చాలా మంది ఫ్యాన్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటారు కానీ కిచ్చా సుదీప్ లాంటి సూపర్ స్టార్, పర్ఫెక్ట్ యాక్టర్ నుంచి ఎన్టీఆర్ కి ఇలాంటి కామెంట్స్ రావడం గొప్ప విషయం. కర్ణాటకలో ఎన్టీఆర్ కి చాలా ఫాలోయింగ్ ఉంది, స్ట్రాంగ్ మార్కెట్ ని కూడా మైంటైన్ చేసే ఎన్టీఆర్ కర్ణాటకకి అడాప్టెడ్ సన్ లాంటి వాడు. అందుకే ఎన్టీఆర్ సినిమాలు కర్ణాటకలో చాలా మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అక్కడక్కడా కన్నడలో కూడా మాట్లాడే ఎన్టీఆర్… పునీత్ రాజ్ కుమార్ సినిమాలో కన్నడ సాంగ్ కి పాడడం విశేషం.
ఇదిలా ఉంటే దేవర సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవరగా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో సినీ అభిమానుల్లో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ దేవర గ్లింప్స్ బయటకి వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదే హైప్ ని రిలీజ్ వరకూ మైంటైన్ చేస్తే చాలు ఎన్టీఆర్ పాన్ ఇండియా హిట్ కొట్టేసినట్లే. అయితే ఎన్టీఆర్ హిట్ కొట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ ని వెంటాడుతోంది. రాజమౌళితో సినిమా చేసి హిట్ కొట్టిన హీరో… తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది. సో ఈ సెంటిమెంట్ ని దాటి ఎన్టీఆర్ హిట్ కొడితే చరిత్ర తిరగరాసినట్లే.
Ofcourse 🥂
An epitome of energy. https://t.co/cym8vbiaqR— Kichcha Sudeepa (@KicchaSudeep) January 16, 2024