NTR: ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు. ఒక్క సీన్ అవుట్ ఫుట్ మంచిగా రాకపోయినా మళ్లీ రీ షెడ్యూల్ చేస్తూ.. ఎంతో జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఎదురుచూస్తూ ఉంది. YRF స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా భాగం కానున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వార్ 2 రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే స్పైయిన్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన వార్ 2 సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఎన్టీఆర్ డూప్ తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేశారని టాక్. ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఇక దేవర షూట్ ను ఫినిష్ చేసి.. తారక్, వార్ 2 సెట్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇక్కడవరకు ఓకే కానీ, ఈ రెండు సినిమాలు అవ్వకముందే బాలీవుడ్ లో మరో సినిమాను తారక్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. వార్ 2 మేకర్స్ తోనే ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఇందులో సోలో హీరోగా తారక్ నటించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. నిజం చెప్పాలంటే వార్ 2 అనౌన్స్ మెంట్ తోనే ఎన్టీఆర్ కు.. బాలీవుడ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ఇక వార్ 2 కనుక హిట్ అయితే.. పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రజలకు అలవాటు పడినట్లే.. దీంతో ఈ రెండో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అవుతాయి. ప్లానింగ్ అంతా బావుంది కానీ, దేవర అవ్వలేదు.. వార్ మొదలెట్టలేదు.. అప్పుడే ఇంకొకటి అంటే కష్టమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. దేవర, వార్ 2 తరువాత ఎన్టీఆర్ 31 లైన్లో ఉంది. ఇప్పుడంటే ప్రశాంత్ నీల్.. సలార్ 2 మీద ఫోకస్ చేశాడు.. ఆ తరువాత ఎన్టీఆర్ తోనే.. మరి ఈ బాలీవుడ్ సినిమాను ఎన్టీఆర్ ఎలా మ్యానేజ్ చేస్తాడు అనేది చూడాలి.