Site icon NTV Telugu

RRR : నందమూరి అభిమానుల సందడి… లారీలో థియేటర్ కు…

rrr

rrr

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు RRR సందడి మొదలైంది. స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్లు, విదేశాల్లో ప్రీమియర్లు చూసిన ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల నేపధ్యంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్, తారక్ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పాలాభిషేకాలు, డప్పులు, బాణాసంచాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో లారీలలో ‘ఆర్ఆర్ఆర్’ వీక్షించడానికి భారీ సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జంతువులను బలిచ్చి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ ముందు కొంతమంది అభిమానులు ఒక మేకను బలి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నాలుగేళ్ళ నిరీక్షణ కదా… ఆ మాత్రం సెలెబ్రేషన్స్ ఉండాల్సిందే అంటున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ !!

Read Also : RRR : థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ… చెర్రీ, ఉపాసన రియాక్షన్

Exit mobile version