ప్రస్తుతం ఎన్టీఆర్ 30 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ 30 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ఈలోపే ఎన్టీఆర్ 30కి లీకులు మొదలైపోయాయి. తాజాగా ఎన్టీఆర్‌కు సంబందించిన కొన్ని ఆన్ లోకేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ కలర్ ఫుల్ డ్రెస్‌లో.. అదిరిపోయే అవుట్ ఫిట్‌తో కనిపిస్తున్నాడు. ఏదో రెస్టారెంట్‌లో ఊరి నుంచి తన కోసం వచ్చిన పెద్దలతో ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటో ఇలా లీక్ అయిందో లేదో.. సోషల్ మీడియాను షేక్ చేసేసింది.
ఈ విషయంలో ఎన్టీఆర్.. చిత్ర యూనిట్ పై చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ కూడా ఫైర్ అయ్యాడట.. ఎవరు లీక్ చేశారని ఆరా తీసే పనలో ఉన్నారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేసిన వారిని వదిలేదేలే అంటున్నారట. మున్ముందు మళ్లీ ఇలాంటి సీన్స్ రిపీట్ అవకుండా చర్యలు తీసుకుంటున్నారట. ఫ్యాన్స్ కూడా ఇలాంటివి జరగకుండా చూడాలని మేకర్స్‌ను కోరుతున్నారు కానీ ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అయితే ఎన్టీఆర్ లీక్డ్ లుక్ చూస్తుంటే.. కొరటాల శివ ఈ సినిమాతో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా.. చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక లీకుల్ని ఆపడం మేకర్స్‌కు సవాల్‌గా మారింది. మరి మున్ముందు ఎన్టీఆర్ 30 ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.
