NTV Telugu Site icon

Kantara: మీరు చూసింది పార్ట్ 2నే, రాబోయేది పార్ట్ 1…

Kantara

Kantara

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రీజనల్ మూవీగా కేవలం 16కోట్ల బడ్జట్ లో తెరకెక్కిన ఫక్తు కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టీ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమకి రెస్పెక్ట్ ని తెచ్చింది. ముందుగా కన్నడలో స్టార్ట్ అయిన కాంతార నెమ్మదిగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. వరాహ రూపం సాంగ్ కాంతార సినిమాకి ప్రాణం పోసింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంట అనే మాట సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం, వర్డ్ ఆఫ్ మౌత్ వైల్డ్ ఫైర్ లాగా బయటకి వచ్చింది. దీంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అనే తేడా లేకుండా కాంతార సినిమా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రేంజులో కలెక్షన్స్ ని రాబట్టింది. కొన్ని వారాల పాటు ఇండియా మొత్తం కాంతార సినిమా జపం చేసింది అంటే ఆ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఓవరాల్ గా కాంతార సినిమా 450 కోట్లపై పైగా వసూల్ చేసి మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది.

Read Also: NBK 108: త్వరలో సెకండ్ షెడ్యూల్…

2023 ఆస్కార్స్ లో కూడా ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల జాబితాలో కాంతార కూడా చేరింది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కూడా కాంతార సినిమాకి మంచి డిమాండ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి వంద రోజులు అయిన సంధర్భంగా హోంబెల్ ఫిల్మ్స్, కాంతార 2 వస్తుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో కాంతార 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడుగుతున్న వాళ్లకి రిషబ్ శెట్టీ ఒక క్లారిటీ ఇస్తూ… “ఇప్పుడు మీరు చూసింది పార్ట్ 2నే, నెక్స్ట్ వచ్చేది పార్ట్ 1… రాబోయే సినిమా కాంతారకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్” అంటూ క్లియర్ కట్ గా చెప్పేశాడు. అంటే కాంతార అసలు ఎక్కడ ప్రారంభం అయ్యింది, శివ వాళ్ల నాన్న కథ ఏంటి? లాంటి విషయాలు నెక్స్ట్ సినిమాలో చూసే ఛాన్స్ ఉంది.