NTV Telugu Site icon

Nora Fatehi In Matka: ‘మట్కా’ కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి

Nora

Nora

Nora Fatehi Came Hyderabad For Pan India Movie Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రారంభోత్సవ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో నోరా ఫతేహి కి డ్యాన్స్ నంబర్ ఉంటుందని ఆమె పాత్ర చాలా కీలకమైనదని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటించడానికి ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అంటున్నారు. 1958-1982 మధ్య కాలంలో జరిగే ఈ సినిమా కథలో వైజాగ్ అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్ గా భావిస్తోంది నోరా ఫతేహి.

Deepak Malakar: కాస్టింగ్ డైరెక్టర్ అరాచకం.. అందుకు అంగీకరించలేదని తలపగలకొట్టి!

ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌ వచ్చారు, మరో మూడు రోజుల పాటు ఆమె టీమ్‌తో సమయం వెచ్చించనున్నారు. ముందు నోరాకి లుక్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆమె తన పాత్ర ప్రిపరేషన్ కోసం వర్క్‌షాప్‌లో పాల్గోన్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాక నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నట్టు సినిమా టీమ్ చెబుతోంది. ముఖ్యంగా రు. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని రీ క్రియేట్ చేసేందుకు సినిమ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియా సేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వరుణ్ తేజ్‌కి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన మట్కా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Show comments