noor-malabika-das-gets-bald-18-days-before-suicide-video: ముంబైలోని తన ఫ్లాట్‌లో నటి నూర్ మలాబికా దాస్ శవమై కనిపించిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని వారు అనుమానిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ నుంచి నటిగా మారిన నూర్ ‘ది ట్రయల్’ కాకుండా అనేక ఇతర సిరీస్ లలో కూడా పనిచేసింది. ఆమె చేసిన ఉల్లు సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. నటి కుటుంబం నుండి ఎవరూ ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాకపోవడంతో పోలీసులు ఒక NGO సహాయంతో ఆమెను దహనం చేశారు. లోఖండ్‌వాలాలోని ఒక అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్న ఆమె ఇంటి నుంచిహ్ దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు జూన్ 6న పోలీసులకు సమాచారం అందించగా, వారి ఇంటి తలుపులు పగలగొట్టారు. నూర్ మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక విచారణ ఆధారంగా పోలీసులు కేసును ఆత్మహత్యగా ప్రకటించారు.
Vijay Deverakonda: స్ట్రాంగ్ గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి!
అయితే ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, నూర్ మల్బికా దాస్ సెలూన్‌లో కూర్చుని జుట్టు మొత్తం తీసేసి గుండు కొట్టించుకుంటూ కనిపించింది. ఈ వీడియోను ఆమే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూనే బ్యాక్ గ్రౌండ్ లో ఓ ఎమోషనల్ సాంగ్ కూడా పెట్టారు. నటి నల్లటి ఒత్తుగా ఉన్న వెంట్రుకలను చూసి, కేశాలంకరణ ఆమెను ఎంత కత్తిరించాలని అడగగా నటి పూర్తిగా తొలగించాలని కోరింది. ఇక ఈ వీడియో మే 19న పోస్ట్ చేయబడింది. జుట్టు షేవ్ చేసుకున్న తర్వాత కూడా నటి కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో బోడి తల తలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది, అందులో ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మల్బిక ఈ మధ్య చాలా పోస్ట్‌లను షేర్ చేస్తోంది.