Site icon NTV Telugu

SP.Balasubramanyam: బాలుకి ప్రేమతో.. మ్యూజిషియన్స్‌ యూనియన్‌ ఘన నివాళి

Spb

Spb

లెజండరీ సింగర్‌, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఇష్టపడని వారుండరు. ఆయన పాటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగు వారికి పాటంటే బాలునే.. కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసినప్పటికీ.. పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటికి ఆయన పాడిన పాటలు పలు వేదికలపై మారుమ్రోగిపోవడం.. ఇక జూన్ 4 న ఆయన జయంతి అన్న విషయం విదితమే.. ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ రవీంద్రభార తిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌ మాట్లాడుతూ.. “బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. జూన్‌ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకని ఉదయం 10 గంటలనుండి రాత్రి 10 గంటలవరకు 12గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్‌ చేస్తున్నాం. పాటల కచేరితో ఆ మహనీయుణ్ని గుర్తు చేసుకోవటం మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని” అన్నారు.

సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. 30ఏళ్ల చరిత్ర ఉన్న మా సినిమా మ్యూజిక్‌ యూనియన్‌లో 1500మంది సభ్యులకు పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా సింగర్స్‌ అవుదామనుకునేవారికి మ్యూజిషియన్స్‌కి మా యూనియన్‌ తొలిమెట్టు. మా వద్ద సభ్యులై ఉంటే వారు సినిమా, టీవీ, ఓటిటి ఇలా ఎక్కడ పనిచేసినా వారికి మా సంస్థ తరపునుండి పూర్తి సహాయ,సహకారాలను అందచేస్తాము అని చెప్తున్నాము. పాండమిక్ లో వయసు పైబడిన కళాకారులతో పాటు, ఆపదలో ఉన్న ఎంతోమందికి మా యూనియన్‌ ద్వారా ఆర్ధికంగా చేయూతనిస్తున్నాం. బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి 2019లో మా యూనియన్‌ సభ్యులకోసం ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ఆ ప్రోగ్రామ్‌ని కన్నులపండుగలా జరిపి మా అందరికీ మార్గదర్శకులుగా ఉండి మా వెన్నంటి నిలిచారు బాలుగారు. దురదృష్టవశాత్తు ఆయనను కోల్పోయాం. అప్పుడు ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్‌ కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. జూన్‌4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్‌ ప్రతినిధులుగా నేను, వైస్‌ ప్రెసిడెంట్‌ జైపాల్‌రాజు, సెక్రటరీ రామాచారి, జాయింట్‌ సెక్రటరీ మాధవి రావూరి, ట్రెజరర్‌ రమణ శీలంలు మా యూనియన్‌లోని 1500మంది సభ్యులకు ప్రతినిధులుగా ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం” అని తెలిపారు.

Exit mobile version