బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. చీటింగ్ కేసులో సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవ్వడంతో ఆమె న్యాయపరమైన చిక్కుల్లో పడింది. 2019లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టుకు సోనాక్షి హాజరు కావాల్సి ఉంది. ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ ఆర్గనైజర్ సోనాక్షిపై మోసం, నేరపూరిత కుట్ర, ఉల్లఘించడం వంటి ఆరోపణలు చేశారు. ఈ లీగల్ ఇష్యూలో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సోనాక్షి మొరాదాబాద్ కోర్టుకు రావాలని ఆదేశించారు. అయితే సోనాక్షి సిన్హా రాకపోవడంతో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Read Also : Radhe Shyam Press Meet : లైవ్
మొరాదాబాద్‌లోని కట్ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ ఆర్గనైజర్, సోనాక్షి సిన్హాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్‌కు ఆమె రూ.37 లక్షలు వసూలు చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆమె కార్యక్రమానికి హాజరు కాలేదు. నిర్వాహకుడు ఆమెను అప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాలని కోరగా, దానికి సోనాక్షి మేనేజర్ నిరాకరించారు. దాంతో అతను డబ్బు కోసం సోనాక్షి సిన్హాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదట. చేసేది లేక ఆ ఈవెంట్ ఆర్గనైజర్ చీటింగ్ అంటూ కేసు నమోదు చేశాడు.
