Site icon NTV Telugu

Prudhvi Raj: నటుడు పృథ్వీరాజ్ కి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!

Prudhvi Raj

Prudhvi Raj

Non Bailable Arrest Warrant o Prudhvi Raj: సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పృధ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి తనకు మనోవర్తి చెల్లించే అంశం మీద కోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు చెల్లించాల్సిన మనోవర్తి బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

Chandrababu: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్ కి 84 లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పృద్వికి ఆయన భార్యకు వివాదాల ఏర్పడిన నేపథ్యంలో వారు విడిగానే ఉంటున్నారు. శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటూ 2017లో కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. పృథ్వీరాజ్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని అయితే సినిమాల్లోకి వెళ్లాక తనను వేధిస్తూ ఉండేవాడని, 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె అప్పట్లో ఫిర్యాదు చేశారు.

అప్పట్లోనే తన భర్త సినిమాలో టీవీ సీరియల్స్ చేస్తూ నెలకు ₹30 లక్షల సంపాదిస్తున్నారు కాబట్టి భరణం ఇప్పించాలని 2017లో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు 2022లో వెలువడింది. అప్పటివరకు ఆమెకు ఖర్చయిన కోర్టు ఖర్చులతో పాటు ప్రతినెలా ఎనిమిది లక్షలు పదో తేదీ లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతోని పృథ్వీరాజ్ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో వైసీపీలో ఆక్టివ్ గా ఉన్న ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా స్వీకరించారు. తర్వాత పలు వివాదాలతో తప్పుకున్నారు. తర్వాత జనసేనకు దగ్గర వైసిపి మీద ఫైర్ అవుతూ ఉండేవారు.

Exit mobile version