Site icon NTV Telugu

Degala Babji: అరెరే.. బండ్లన్నను పట్టించుకున్న నాథుడే లేడే..?

Bandla Ganesh

Bandla Ganesh

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జీవితం అందరికి తెరిచిన పుస్తకమే. నటుడిగా కెరీర్ ను ప్రారంభించడం, ఆ తర్వాత నిర్మాత గా మారడం, రాజకీయాలకు వెళ్లడం, అందులో నిలబడలేక మళ్లీ వెనక్కి రావడం అన్ని తెలిసినవే.. ఇక ఇటీవల నటుడిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్లన్న తాజాగా డేగల బాబ్జీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 20 న రిలీజ్ అయినా ఈ సినిమాను పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. నిన్నటికి నిన్న నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజశేఖర్ నటించిన శేఖర్.. ఇక ఈ సినిమా కాకుండా చెప్పుకోదగ్గ సినిమాల్లో డేగల బాబ్జీ ఉంది. కానీ ప్రేక్షకులు మాత్రం దీని గురించి పట్టించుకొనే లేదు.

తమిళంలో పార్తీబన్ నటించగా జాతీ అవార్డుని తెచ్చి పెట్టిన `ఒత్తాత సెరుప్పు సైజ్ 7` చిత్రాన్ని తెలుగులో `డేగల బాబ్జి` పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లకపోవడానికి కారణం ప్రమోషన్స్ చేయకపోవడమే అని టాక్ నడుస్తోంది. రూ. 100 కోట్లు బడ్జెట్ తో స్టార్ హీరోలు నటించిన సినిమాలే ప్రమోషన్స్ లేకపోతే బాక్సాఫీస్ వద్ద తుస్సుమంటున్నాయి. అలాంటింది ఒకే ఒక్క పాత్రతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీకి ఎంత ప్రమోషన్ చేయాలి. కానీ, ఆ విషయంలో బండ్ల గణేష్ వెనుకబడ్డాడు. సినిమా తీసేసాం కదా ఇంకెందుకు అనుకున్నాడో లేక ప్రేక్షకులు కథ నచ్చితే వారే థియేటర్లకు వచ్చి చూస్తారు అనుకున్నాడో తెలియదు కానీ.. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషన్ కూడా చిత్రం బృందం చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ప్రేక్షకులకు తెలియకుండానే పోయింది. ఇక పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడైన కారణంగా పవన్ ఫ్యాన్స్ అయినా ఈ సినిమాను చూస్తారేమో అనుకుంటే వారు కూడా ఈ మూవీపై ఆసక్తిని చూపించడం లేదట. ఇక దీంతో అరెరే బండ్లన్నను పట్టించుకున్నవారే కరువయ్యారా..? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version