Site icon NTV Telugu

Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లి శోభితతోనే.. త్వరలోనే అధికారిక ప్రకటన?

Naga Chaitanya (13)

Naga Chaitanya (13)

No truth in Naga Chaitanya 2nd marriage reports: సమంత నాగచైతన్య విడాకుల తరువాత వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎన్ని చర్చలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమంతకి ఎవరెవరితోనో లింకులు పెట్టారు, ఇక ఈ మధ్య నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల గురించి కూడా కధనాలు వండి వార్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాదు ఈ ఇద్దరు విడిపోయినట్టు ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు కూడా ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార వేత్త కుమార్తెను చైతూ మ్యారేజ్‌ చేసుకోబోతున్నాడని, సినిమాకి సంబంధం లేని ఫ్యామిలీ కావడంతో వారి వివాహ జీవితం సాఫీగా సాగనుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పెళ్ళికి నాగార్జున కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే వార్తలు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Naga Suseela: హీరో నాగార్జున చెల్లెలిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?

అయితే ఇదంతా నిజం కాదని నాగచైతన్య సన్నిహితులు చెబుతున్నారు. నేషనల్ మీడియా వెబ్ సైట్ ఇండియా టుడే ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఈ పుకార్లు నిరాధారమైనవి అని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు వారు నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళతో డేటింగ్లో ఉన్నాడని, వారు రిలేషన్ బలంగా ఉన్నారని చెప్పినట్టు పేర్కొన్నారు. చైతూ సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే పుకార్లలో నిజం లేదని తేల్చేశారు. అంతేకాదు ఒక షాకింగ్ విషయాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు. నాగచైతన్య-శోభిత త్వరలో తమ రిలేష ను అనౌన్స్ చేయాలని యోచిస్తున్నట్లు వారు వెల్లడించారు. వారు తమ ప్రేమను బహిరంగంగా అంగీకరించడానికి ఏమాత్రం వెనుకాడరు అని సదరు సన్నిహితులు వెల్లడించారని తెలుస్తోంది. ఇక నాగచైతన్య ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు.

Exit mobile version