జేమ్స్ బాండ్ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటాయి. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, ఎగ్జోటిక్ లొకేషన్స్, భారీ తారాగణం, సాంకేతిక పరిజ్ఞానం ఇలా సినిమాలోని ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. ‘007’ సినిమాలు ప్రేక్షకులను ఉత్సాహపరిచే అంశాలతో లోడ్ అవుతాయి.
Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!
జేమ్స్ బాండ్ సిరీస్‌లో తదుపరి చిత్రం ‘నో టైమ్ టు డై’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో డేనియల్ క్రెయిగ్‌ను పరిచయం చేయడమే కాకుండా విజువల్స్, పలు యాక్షన్ ఎపిసోడ్‌లను చూడొచ్చు. ఆస్కార్ విజేత నటుడు రామి మాలెక్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన డైలాగ్‌లు సూపర్. ట్రైలర్ ఒక క్యాప్సూల్ ఫైటర్ జెట్‌గా మారే ఎపిక్ విజువల్‌తో ముగుస్తుంది. ఇది నిజంగా అద్భుతంగా ఉంటుంది. మరి జేమ్స్ బాండ్ సినిమాన మజాకా. ‘నో టైమ్ టు డై’ ముందుగా ఇండియాలోనే విడుదల కానుంది. సెప్టెంబర్ 30న ఇక్కడ విడుదలయ్యాక యుఎస్, యుకెతో పాటు ఇతర ప్రాంతాల్లో అక్టోబర్ 8న విడుదల కానుంది.
