Site icon NTV Telugu

పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్

James

దివంగత కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “జేమ్స్”. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేసథ్యంలో కన్నడ డిస్ట్రిబ్యూటర్లు పునీత్ కోసం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. “జేమ్స్” విడుదలైన వారం వరకు మరే ఇతర చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారట. కర్ణాటక చలనచిత్ర పంపిణీదారులు పునీత్ చివరి చిత్రాన్ని అభిమానులకు మరింత ప్రత్యేకం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారట. పునీత్ రాజ్‌కుమార్‌ గౌరవార్థం “జేమ్స్” విడుదలయ్యాక వారానికి అంటే 17 నుండి 23 మార్చి వరకు ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని తీర్మానించారు.

Read Also : బిగ్ అప్డేట్ : లవర్స్ డే రోజున “సర్కారు వారి పాట” ట్రీట్

మార్చి 17 నుండి 23 వరకు కర్ణాటక థియేటర్లలో ‘జేమ్స్’ తప్ప మరే కన్నడ సినిమా ప్రదర్శితం కాదన్న మాట. ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. పునీత్ అభిమానులు ఇప్పుడు ‘జేమ్స్’ చివరి సినిమాను చూసేందుకు సంతోషంగా, భావోద్వేగంగా ఉన్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్ యాక్షన్ గ్యారెంటీగా ఉంటుంది. పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్‌ లు ‘జేమ్స్’ను నిర్మించారు. అంతేకాదు వీరిద్దరూ ఈ సినిమాలో అతిధి పాత్రల్లో నటించారు. నిజానికి ఈ ముగ్గురు అన్నదమ్ములను కలిసి పెద్ద తెరపై చూడాలని పునీత్ అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి కోరికను ‘జేమ్స్’ మూవీ తీర్చబోతోంది. కానీ పునీత్ లేకపోవడం ఒక్కటే లోటు.

Exit mobile version