No more movies after political entry says Vijay: గత కొన్ని వారాలుగా, తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలా ఆయన సినిమాలకు బ్రేక్ కూడా విరామం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ కనగరాజ్ ‘లియో’ తర్వాత, స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘తలపతి 68’ సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 2024 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టడానికి మూడు సంవత్సరాల విరామం తీసుకుంటారని ప్రచారం జరుగుతూ ఉండగా తాజాగా ఈ విషయం మీద తలపతి విజయ్ స్పందించారు. ఇక తన అభిమానులను ఉద్దేశించి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రవేశం తర్వాత ఇక సినిమాలు చేయను అని చెప్పినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు చెందిన విజయ్ మక్కల్ ఇయక్కం నేతలతో ఈరోజు విజయ్ సమావేశమయ్యారు.
SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!
మధ్యాహ్నం చెన్నైలోని పనైయూర్‌లోని సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సమావేశంలో పాల్గొన్న ఓ సభ్యురాలు విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయం వచ్చినప్పుడు సినిమాల నుంచి తప్పుకుంటానని, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటానని విజయ్ ఈ సమావేశంలో చెప్పారని ఆమె వెల్లడించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఎప్పుడైతే ఆయన తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ కార్యచరణను ప్రారంభిస్తారని కూడా ఆమె అన్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రజనీకాంత్, అజిత్ కుమార్ అభిమానులు విజయ్‌కి మద్దతు ఇస్తారని విజయ్ అభిమానులు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు.